Wednesday, April 24, 2024

జైలులో మసాజ్​ వీడియో బయటికి.. ఈడీపై కోర్టు సీరియస్​, ధిక్కరణ కింద నోటీసులు జారీ

మనీ లాండరింగ్​ కేసులో తీహార్​ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ చేయించుకుంటున్న CCTV వీడియో ఒకటి శనివారం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.- సత్యేందర్ జైన్ సీసీటీవీ ఫుటేజీని లీక్ చేసినందుకు గాను ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సీరియస్​ అయ్యింది. ఈ వీడియో బయటికి వచ్చిన కారణంగా కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్ ఈడీకి నోటీసు జారీ చేసి, దీనికి సంబంధించిన విచారణను నవంబర్ 21కి వాయిదా వేశారు.

కాన్ఫిడెన్షియల్ ఫుటేజీ బీజేపీకి ఎలా లభించిందని, దాన్ని ఎందుకు సర్క్యులేట్ చేశారనే విషయమ్మీద కోర్టు సోమవారం విచారించనుంది. సత్యేందర్ జైన్ తరపు న్యాయవాది మొహమ్మద్ ఇర్షాద్ దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. అంతకుముందు రోజుసత్యేందర్​ జైన్ న్యాయ బృందం కోర్టులో హామీ ఇచ్చినప్పటికీ ED CCTV వీడియోను లీక్ చేసిందని ఆరోపించారు.

సెప్టెంబరు 13 నాటి సీసీటీవీ ఫుటేజ్‌లో మంత్రి తన మంచంపై పడుకుని కొన్ని పేపర్లు చదువుతున్నట్లు కనిపించింది. అతని పక్కన కూర్చున్న వ్యక్తి తన పాదాలకు మసాజ్ చేస్తున్నాడు. మరో వీడియోలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఒక వ్యక్తి ఢిల్లీ మంత్రి కాళ్లకు, బాడీకి మసాజ్ చేస్తున్నాడు.. అతనికి పూర్తి తల మసాజ్ చేయడానికి ముందుకు వెళ్లాడు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ED నిందితుడు సత్యేందర్ జైన్‌కు తీహార్ జైలులో ప్రత్యేక ట్రీట్‌మెంట్ లభించిన 10 రోజుల తర్వాత శనివారం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

- Advertisement -

ఇది జరిగిన వెంటనే ఢిల్లీలోని తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్​ని సస్పెండ్​ చేశారు. జైలులో ఉన్న ఢిల్లీ మంత్రిని వీఐపీ ఖైదీగా ట్రీట్​ చేశారనే ఆరోపణలపై అతడిని సస్పెండ్ చేశారు. మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ అరెస్టయి జూన్ నుండి జైలులో ఉన్నాడు. ఢిల్లీ కోర్టు కూడా అతని బెయిల్ దరఖాస్తును గురువారం తిరస్కరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement