Saturday, April 20, 2024

ఒమిక్రాన్ వ‌చ్చినంత మాత్రాన భ‌య‌ప‌డొద్దు .. కేజ్రీవాల్ ..

ఒమిక్రాన్ కేసు వ‌చ్చినంత‌మాత్రాన భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ మాస్క్ ని త‌ప్ప‌ని స‌రిగా ధ‌రించాల‌ని , భౌతిక దూరం పాటించాల‌ని చెప్పారు. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను ఆపేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు. కాగా ఆఫ్రికా దేశమైన టాంజానియా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు తేలింది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వైరస్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 27 మందిని ఆసుపత్రికి తరలించామని వెల్ల‌డించారు. వీరిలో 17 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని… మిగిలిన వారు వారికి కాంటాక్టులోకి వచ్చినవారని అన్నారు. వీరిలో 12 మంది శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామని… వీరిలో ఒకరికి ఒమిక్రాన్ అని తేలిందని వివ‌రించారు. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపారు. శానిటైజ‌ర్ , మాస్క్ త‌ప్ప‌ని స‌రి అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement