Saturday, January 22, 2022

ఆటో డ్రైవ‌ర్ ఇంట్లో భోజ‌నం చేసిన సీఎం..ఎవ‌రో తెలుసా..

సాధార‌ణ ఆటోడ్రైవ‌ర్ ఇంట్లో భోజ‌నం చేశారు ఓ సీఎం..అంతేకాదు కాసేపు ఆ ఆటోవాలాతో ముచ్చ‌టించారు కూడా. ఆయ‌నే ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. ప్ర‌స్తుతం ఆయ‌న లుతియానాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా దిలీప్ తివారీ అనే ఆటో డ్రైవర్ సీఎం గారు మీరు చాలా మంది ఆటో డ్రైవర్ లకు సాయం చేశారు. ఈ పేద ఆటో డ్రైవర్ ఇంటికి భోజనంకు రాగలరా అంటూ ఆహ్వానించారు. దాంతో ఏమీ ఆలోచింకుండా కేజ్రీవాల్ అతడి ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. దాంతో వారి ముఖాలు ఆనందం తో వెలిగిపోయాయి. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో ఆప్ జెండా ఎగురవేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా నిలవగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News