Saturday, April 20, 2024

డిగ్రీలో ఫారెన్‌ లాంగ్వేజెస్‌ కోర్సులు.. కామన్‌ పీజీ ఎంట్రెన్స్‌లో మార్పులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉన్నత విద్యామండలి 2022-23 విద్యాసంవత్సరానికి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కాలేజీల్లో ఫారిన్‌ లాంగ్వెజెస్‌ కోర్సులను ప్రవేశపెట్టబోతోంది. మల్టిd నేషనల్‌ కంపెనీల్లో, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఈ ఫారెన్‌లాంగ్వెజెస్‌ కోర్సులు ఎంతో ఉపయోగకరం కానున్నాయి. ప్రపంచ స్థాయి నగరాలతో హైదరాబాద్‌ నగరం పోటీ పడుతోంది. వివిధ దేశాల నుంచి ఐటీ, ఫార్మా, ఇతర మల్టిdనేషనల్‌ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో బహుభాషలు (మల్టిdలాంగ్వెజెస్‌) వచ్చిన వారికి ఆయా కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, స్పానిష్‌, చైనీస్‌ లాంగ్వెజెస్‌ కోర్సులను డిగ్రీ స్థాయి నుంచి మన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌ మాసాబ్‌ ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు. ఇప్పటికే ఫ్రెంచ్‌ అలియన్స్‌తో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంవోయు కుదుర్చుకున్నట్లు తెలిపారు. త్వరలో ఇతర దేశాల వర్సిటీలతోనూ ఒప్పందం కుదుర్చుకొని డిగ్రీలో ఫారెన్‌ లాంగ్వెజెస్‌ కోర్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఫ్యాకల్టిdని ఆయా దేశాల నుంచే రిక్రూట్‌ చేసుకోనున్నారు. అయితే దీనికి ఉస్మానియా యూనివర్సిటీ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది.

కామన్‌ పీజీ ఎంట్రెన్స్‌లో మార్పులు…
గతంలో డిగ్రీలో ఏ కోర్సు చదివితే దానికి సంబంధించిన స్పెషలైజేషన్‌తోనే పీజీ ఎంట్రెన్స్‌ రాసి కోర్సు చేసేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి కామన్‌ పీజీ ఎంట్రెన్స్‌లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి నూతన మార్పులు తీసుకొచ్చింది. యూజీలో ఏ కోర్సు పూర్తి చేసినా పీజీలో తమకిష్టమొచ్చిన కోర్సును ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. డిగ్రీలో ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ ఇలా ఏ గ్రూపు చదివినా.. పీజీలో పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, ఇంగ్లీష్‌, తెలుగు కోర్సులు ఎంచుకోవచ్చని పేర్కొంది. ఈ విధానం ఇప్పటికే ఫుడ్‌ కోర్సులకు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్ట్స్‌, సోషల్‌ సైన్సెస్‌ కోర్సుల్లో ఈ విధానాన్ని తీసుకురాబోతున్నారు. విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగ పడుతోందని అధికారులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement