Saturday, May 28, 2022

కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా.. సీఎం హోదాలో విమర్శలా : చన్నీ

ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేస్తానని పంజాబ్‌ సీఎం చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ హెచ్చరించారు. తన మేనల్లుడిపై ఐటీ దాడులకు సంబంధించి కేజ్రీవాల్‌ ఆరోపణలు సరికావన్నారు. నిజాయితీ లేని వారు అని కేజ్రీవాల్‌ అనడంపై చన్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరువు నష్టం దావా వేస్తానని తెలిపాడు. తనతో పాటు ఇతరుల విషయంలో కూడా కేజ్రీవాల్‌ ఇలాగే వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది వరకు నితిన్‌ గడ్కరీ, అరుణ్‌ జైట్లీ, శిరోమణి అకాలీ దళ్‌ నేత బిక్రమ్‌ సింగ్‌ మాజితియాపై కూడా ఆరోపణలు చేశారన్నారు.

ఇప్పటికే కేజ్రీవాల్‌ తన పరిధి దాటిపోయారన్నారు. పరువు నష్టం దావా వేసేందుకు పార్టీ అనుమతి కూడా కోరినట్టు చన్నీ తెలిపారు. చన్నీ మేనల్లుడి ఇంటిపై ఐటీ దాడుల నేపథ్యంలో.. కేజ్రీవాల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లాది రూపాయలు వెలుగు చూశాయని, ఈ సొమ్ము ఎక్కడిది అంటూ ప్రశ్నించారు. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ చేయడం సీఎం హోదాలో ఉన్న కేజ్రీవాల్‌కు తగదని చన్నీ విమర్శించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement