Saturday, February 4, 2023

దీపిక, అనన్య డోసు పెంచేశార‌ట‌.. అందుకే ఆ మూవీ ఓటీటీలో రిలీజ్‌..

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక.. చాలా సినిమాలు థియేటర్స్‌లో కంటే ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. కొవిడ్ వల్ల కొన్ని సినిమాలు ఇలా రిలీజ్ అయ్యాయి. మరికొన్ని మూవీస్‌ మాత్రం.. సెన్సార్ బోర్డుతో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఓటీటీ బాట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇట్లాంటిదే బాలీవుడ్ సినిమా ఒకటి ఈ మ‌ధ్య‌ ఓటీటీలో రిలీజ్ కావ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధాల కథాంశంగా తెర‌కెక్కుతున్న సినిమా ఇది. ఇందులో రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంద‌ని బిటౌన్ వ‌ర్గాల స‌మాచారం.. అందుకే ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయాలని మూవీ మేక‌ర్స్ డిసైడ్ అయ్యారట.

దీపికా పదుకొణె, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది లీడ్ రోల్ లో.. శకున్ బత్రా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాగా, ఇంత వరకు ఈ మూవీకి టైటిల్‌‌ను మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడున్న స‌మాచారం ప్ర‌కారం దీన్ని డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె, అనన్య పాండే సిస్ట‌ర్స్‌గా నటిస్తున్నారు. దీపిక ఫిట్‌నెస్ ట్రైనర్‌‌గా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement