Thursday, April 25, 2024

టర్కీ, సిరియాలో 9600 దాటిన మృతుల సంఖ్య

టర్కీ, సిరియాలో భూకంపం వచ్చి మూడు రోజులవుతోంది. అయితే మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వెళ్తోంది. టర్కీ, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంప విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు రెండు దేశాల్లో మొత్తం 9,600ల మందికి పైగా చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి. తమ దేశంలో మొత్తం 6,957 మందికి పైగా చనిపోయారని ట‌ర్కీ అధికార యంత్రాంగం ప్రకటించింది. సిరియాలో ఈ సంఖ్య 1,250కు పైగా ఉందని తెలిపింది. రెండు దేశాల్లో మొత్తం 30వేల మందికిపైగా గాయపడ్డారు. శిథిలాల తవ్వకం ఇంకా కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూలిన భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకొన్న వారి కోసం వెతుకులాట కొనసాగుతున్నది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తున్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement