Friday, April 19, 2024

శిథిలాల కింద 104గంట‌లు.. ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డిన మ‌హిళ‌

భారీ భూకంపాల‌తో అత‌లాకుత‌ల‌మైన తుర్కియే..సిరియాలో స‌హ‌య‌క చ‌ర్య‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మృతుల సంఖ్య 24వేలు దాటింద‌ని అధికారులు వెల్ల‌డించారు. కాగా శిథిలాను తొలగించేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అయితే భూకంపం సంభవించి 104 గంటలు గడుస్తున్నప్పటికీ కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. దీంతో సహాక సిబ్బంది ముమ్మరంగా శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తుర్కియేలో శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా క్షేమంగా బయటపడ్డారు. , కిరిఖాన్‌ పట్టణంలో భవన శిథిలాల కింద చిక్కుకున్న జైనెప్‌ కహ్రామన్‌ అనే 40 ఏండ్ల మహిళను జర్మనీ, తుర్కియో సహాయక బృంధాలు క్షమంగా బయటకు తీశారు. అదేవిధంగా నాలుగు రోజులుగా తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు లేకపోయిన ప్రాణాలు నిలుపుకున్న అదియామన్‌ అనే నాలుగేండ్ల చిన్నారిని, మరో పదేండ్ల చిన్నారిని, 17 ఏండ్ల మహమ్మద్‌ కోర్కుట్‌ అనే యువకుడిని సురక్షితంగా బయటకుతీశారు.ఇస్కెందెరన్‌ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవన శిథిలాల్లో 9 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఆరుగురిని రక్షించగా, మరో ముగ్గురిని బయటకు తీసుకురావడానికి యత్నిస్తున్నారు.ఈ మేర‌కు అక్క‌డి వీడియోలు వైర‌ల్ గా మారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement