Friday, April 19, 2024

సన్‌ రైజర్స్‌లోకి.. డేవిడ్‌ వార్నర్‌..!?

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున మళ్లి డేవిడ్‌ భాయ్‌ ఆడనున్నట్టు తెలుస్తున్నది. మాజీ కోచ్‌ టామ్‌ మూడీ మళ్లి హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్‌ డెయిల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా, సైమన్‌ కటీచ్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో టామ్‌ మూడీ నేతృత్వంలోని సనరైజర్స్‌ హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ వార్నర్‌ను మళ్లి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితె కెప్టెన్‌గా కేన్‌ విలియమ్సనే కొనసాగుతాడని తెలుస్తున్నది. కేవలం ఆటగాడిగా మాత్రమే వార్నర్‌ ఉండనున్నాడు. ఓ మోస్తారు ధర వరకు డేవిడ్‌ వార్నర్‌ కోసం పోటీ పడే అవకాశం ఉందని టీమ్‌కు చెందిన ఓ అధికారి తెలిపాడు.

టీమ్‌ అనుకున్న ధరకు అందుబాటులో ఉంటే తీసుకుంటారని, లేదంటే వదిలేస్తారని తెలుస్తున్నది. డేవిడ్‌ వార్నర్‌పై చాలా ఫ్రాంచైజీల కన్ను ఉంది. కనీస ధర రూ.2కోట్లు కాగా.. గరిష్టంగా రూ.15కోట్ల వరకు పలికే అవకాశాలు ఉన్నాయి. అయితే రూ.10కోట్ల వరకు పలికితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో వార్నర్‌ ఒప్పందం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement