Friday, April 19, 2024

Breaking: దర్శకరత్న దాసరి చిన్న కుమారుడు అరెస్ట్

దర్శకరత్న దాసరి నారాయణ రావు చిన్న కుమారుడు, నటుడు దాసరి అరుణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసులో దాసరి అరుణ్ ను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో దాసరి అరుణ్ కుమార్ ఉన్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన దాసరి అరుణ్… ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టినట్లు సమాచారం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన బంజారా హిల్స్ పోలీసులు… దాసరి అరుణ్ పై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement