Friday, March 29, 2024

Darling Prabhas: నా పేరు విక్రమాదిత్య.. ఇదే నా ప్రపంచం..

Radhe Shyam Teaser: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తెలుగు ఇండ‌స్ట్రీలో అతనో ప్రభంజనం.. “బాహుబలి” చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగి.. వరుస ప్యాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పుట్టినరోజు ఇవ్వాల‌..

“ఈశ్వర్ష మూవీతో సైకిల్ పై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. తెలుగు సినిమా పరిశ్రమని ప్రపంచం నలుమూలల విస్తరించి ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. సాహో విడుదలై రెండేళ్లు కావొస్తున్న ప్రభాస్ సినిమా ఏ ఒక్కటి విడుదల కాకపోవడం.. కనీసం టీజర్, ట్రైలర్ లో అయిన తమ డార్లింగ్ ని కళ్లారా చూసుకోవాలని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రభాస్ పుట్టినరోజు కానుకగా “రాధేశ్యామ్” టీజర్ వ‌చ్చేసింది. సుమారుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి షూటింగ్ ఇటలీలోనే జ‌రిగింది. తాజాగా విడుదలైన ప్రోమోలో “నీ పుట్టుక, చావు, ఆనందం, బాధ అన్ని నాకు తెలుసు.. అవి నీకు చెప్పిన అర్ధం కావు.. రాతలను గీతలుగా మార్చి చదవడం నా ప్రత్యేకత.. నా పేరు విక్రమాదిత్య ఇదే నా ప్రపంచం.. అంటూ చెబుతున్న ప్రభాస్ క‌నిపిస్తాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ స్టైలిష్ లుక్ తో లవర్ బాయ్ గా అభిమానులను ఆకట్టుకున్నాడు.

ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా నటించిన ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ నిర్మాతలుగా వ్యవహారించారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా “రాధేశ్యామ్” చిత్రం విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement