Wednesday, April 17, 2024

Spl Story: సోషల్​ మీడియాలో ఫ్యామిలీ ఫొటోలు షేర్​ చేస్తున్నారా? అయితే మీరు రిస్క్​లో ఉన్నట్టే!

సైబర్​ మోసాలకు తెగబడే వారు కొత్త తరహా మోసాలకు ప్లాన్​ చేస్తున్నారు. ఇంతకుముందు మాదిరిగా బ్యాంకుల నుంచి, కరెంట్​ ఆఫీసుల నుంచి మెస్సేజులు సెండ్​ చేసి డబ్బులు గుంజేవారు. ఇప్పుడు వారి స్టైల్​ని మార్చారు. మీ స్మార్ట్​ఫోన్​లోని ప్రొఫైల్​ పిక్​ కానీ, మీరు సోషల్​ మీడియాలో పంపిన మీ కుటుంబ సభ్యుల ఫొటోలను కానీ.. కాపీ చేసి వాటిని న్యూడ్​ ఫొటోలుగా మార్పింగ్​ చేసి తిరిగి వాటిని మీకే పంపించి డబ్బులు డిమాండ్​ చేస్తారు.. ఇట్లాంటి ఘటనలు చాలాచోట్ల వెలుగులోకి వస్తున్నాయి. అందుకని ఇకమీదట ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

టెక్నాలజీ పెరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర అత్యంత ఆధునికమైన స్మార్ట్​ ఫోన్లు, వాచీలు, ఇతర గ్యాడ్జెట్స్​ ఉండడం ఇప్పుడు కామన్​ అయ్యింది. అయితే.. పెరిగిన టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ సైబర్​ నేరగాళ్లు కూడా వారి స్టైల్​ ఆఫ్​ యాక్టివిటీస్​ని మార్చారు. ఇంతకుముందు అయితే.. ‘‘మీరు ఈ నెల కరెంట్​ బిల్​ చెల్లించలేదు. మరో గంటలో డబ్బులు చెల్లించకుంటే ఇవ్వాల అర్ధరాత్రి నుంచి కరెంట్​ బంద్​ అవుతుంది. చీకట్లో మీరు ఇబ్బందిపడాల్సి ఉంటుంది”అనే మెస్సేజులతో మోసాలు చేసేశారు..

ఆ తర్వాత క్యూ ఆర్​ కోడ్​లు పంపించి వాటిని స్కాన్​ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశచూపి మోసాలకు పాల్పడ్డారు.. ఇక ఇప్పుడు వాట్సాప్​, ట్విట్టర్​, ఫేస్​బుక్​, ఇన్​స్టా గ్రామ్​కు సంబంధించిన ప్రొఫైల్​ పిక్​ కానీ, డీపీనీ కానీ కాపీ కొట్టేసి.. దాని తరహాలోనే మరో నెంబర్​తో ఫేక్​ ఐడీ క్రియోట్​ చేస్తున్నారు. దాంతో ఆ ఫ్రొఫైల్​ తెలిసిన వారందరికీ ‘‘ఎమర్జెన్సీలో ఉన్నా..  డబ్బులు కావాలి”అని రిక్వెస్ట్​లు పంపి మోసాలు చేస్తున్నారు.

అంతేకాకుండా ఇప్పుడు కొత్త తరహా మోసాలకు సైబర్​ నేరగాళ్లు పాల్పడుతున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫేస్​బుక్​, ఇన్​స్టాలో షేర్​ చేసుకుని కుటుంబ సభ్యుల ఫొటోలు కానీ, ఆడాళ్ల ఫొటోలు.. వ్యక్తిగత ఫొటోలను కాపీ చేసి వాటిని న్యూడ్​ ఫొటోలుగా మార్పింగ్​ చేస్తున్నారు. ఇక.. ఆ ఫొటోలను పంపించి 50వేల నుంచి లక్ష రూపాయల దాకా డిమాండ్​ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకని సోషల్​ మీడియా అకౌంట్స్​ వాడుతున్న వారు ఎవరైనా సరే.. కుటుంబ సభ్యుల ఫొటోలు కానీ, వ్యక్తిగత ఫొటోలు కానీ డీపీలుగా పెట్టకుండా జాగ్రత్తపడాలని.. ఆడాళ్ల ఫొటోలను సరదాకి అయిన సోషల్​ మీడియాలో పోస్టు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఇట్లాంటి మోసాలకు తెగబడుతున్న వారిలో ఎక్కువగా.. జార్ఖండ్​ రాష్ట్రంలోని జామతారా ​ ఏరియాకు చెందిన వారున్నారని నేషనల్​ క్రైమ్స్​ బ్యూరో వివరాలు వెల్లడించింది. ఒక్క జమతారాలోనే 2021లో 76 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్ జిల్లాలో సైబర్ పోలీసులు ఈ ఏడాది ఇప్పటి వరకు ఇట్లాంటి కేసులను 60 బుక్​ చేశారు.  అయితే అక్కడి వ్యాపారులు ఇట్లాంటి మోసాలను గమనించి ATM కార్డులు, బ్యాంక్​ చెక్​బుక్​లు, ఇతర ఎట్లాంటి డిజిటల్​ బ్యాంక్​ వివరాలను తీసుకోవడం లేదు. వాటిద్వారా తాము ఈజీగా మోసపోతామన్న భయంతో వారు సాంప్రదాయ బ్యాంకింగ్​పైనే ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది.   

సైబర్ మోసాలకు సంబంధించి దేశంలోని 22 రాష్ట్రాల నుండి జమ్తారాకు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ ఎంతలా సైబర్​ క్రైమ్స్​ జరుగుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.  ఇట్లాంటి ఘటనలు ఒక్క జార్ఖండ్​, బిహార్​ రాష్ట్రాల్లోనే కాదు.. యావత్​ దేశమంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ సైబర్ పోలీసు విభాగం గత ఆగస్టులో విస్తృతమైన ఆపరేషన్ చేపట్టి దేశంలోని 22 నగరాల్లో దాడుల నిర్వహించింది.

ఈ క్రమంలో సైబర్​ క్రైమ్స్​కు పాల్పడుతున్న 65 మంది అనుమానితులను అరెస్టు చేసింది. న్యూఢిల్లీ నుండి వచ్చిన పరిశోధకులు డిజిటల్ ట్రయల్‌ను విశ్లేషించి జైపూర్, ఇండోర్, లూథియానా, జమ్తారా, గిరిదిహ్, దేవఘర్, ధన్‌బాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, ముంబై, కతిహార్, దేశ రాజధాని ఢిల్లీ వంటి ఏరియాల నుంచి అనేక ప్రాంతాల్లో ఇట్లాంటి నేరాలు చేస్తున్నట్టు కనిపెట్టారు. 

పెద్ద సంఖ్యలో సైబర్​ నేరాలు.. రికార్డులివే!

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో మొత్తం 52,974 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 2020లో 50,035, 2019లో 44,735, 2018లో 27,248 కేసులు నమోదు అయ్యాయి. ఇక.. 2021లో దాదాపు 60 శాతం సైబర్‌క్రైమ్ కేసులు మోసంతో ముడిపడి ఉన్నాయి.  ఆ తర్వాత లైంగిక దోపిడీ వంటి కేసులైతే 8.6 శాతం.. దోపిడీకి చెందినవి 5.4 శాతం ఉన్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement