Wednesday, April 24, 2024

IPL | ఆఖరి మోకా.. ప్లే ఆఫ్స్​ రేస్​లో చెన్నై కింగ్స్​!

IPL 2023 ఇక ఆఖరి స్టేజీకి చేరింది. ప్లేఆఫ్స్​లో ఎవరెవరు ఉంటారనే చివరి మ్యాచ్​ జరగబోతోంది. కాగా, గ్రూప్ స్టేజ్ చివరి గేమ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ కి ఎట్లాంటి ఉపయోగం లేదు. అయితే.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్​లో గట్టి పోటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

చెన్నైకి గట్టి పోటీ ఇచ్చి గెలవాలనే కోరికతోనే ఢిల్లీ బరిలోకి దిగుతుంది కానీ, చెన్నైకి పార్టీ పూపర్స్ గా ఉండటానికి ఢిల్లీ జట్టు ఎలా ఇష్టపడుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ జట్టు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యింది. కానీ, ఫిరోజ్ షా కోట్లాలో విజయం CSK యొక్క ప్లే-ఆఫ్స్ ప్లాన్‌లో మరింత పట్టును పెంచుతుంది. ఇక.. MS ధోని పిచ్‌లోకి అడుగుపెట్టడం చివరిసారి కావచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక.. పాయింట్స్​ లిస్ట్​లో రెండో స్థానంలో ఉన్న CSK ప్లే ఆఫ్స్​లో ప్లేస్​ కోసం.. చివరి నాలుగు దశలకు చేరుకోవడానికి ఎంతగానో ట్రై చేస్తోంది. దీంట్లో పాయింట్లు, నెట్​ రన్​ రేట్​ వంటివి ఇమిడి ఉన్నాయి. ఢిల్లీమీద గెలిచి ఆ విజయంతో తమ సొంత అదృష్టాన్ని అదుపులో ఉంచుకోవడానికి చెన్నై యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కేకేఆర్​తో మ్యాచ్​కోసం కోల్‌కతాకు వెళ్లినట్లుగానే.. ధోని సేన ఢిల్లీ పయనమవుతోంది. ఇప్పుడు ధోనీకి వేలాది మంది నుంచి సపోర్ట్​ లభిస్తోంది. తమను ఉత్సాహపరిచేందుకు ఇది ఎంతో సహకరిస్తుందని చెన్నై కూడా ఆశిస్తోంది.

ఢిల్లీకి సంబంధించి మెజారిటీ బ్యాటర్ల ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్, రిలీ రోసౌవ్ తమ సత్తా చాటినప్పటికీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. అక్షర్ పటేల్ మినహా ఎవరూ నిలకడగా ఆడడం లేదు. మొహాలీలో అత్యధిక స్కోరింగ్ గేమ్‌లో పంజాబ్‌ను ఓడించిన తర్వాత ఉత్సాహంతో ఇప్పుడు ఢిల్లీలో ఆడేందుకు రెడీ అయ్యారు. ఇక.. చెన్నై జట్టులో రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, మహేశ్ తీక్షణ స్పిన్ ట్రోయికా వంటి వారితో CSK తమ గేమ్ ప్లాన్ స్లోవిష్ వికెట్‌కు సరిపోతుందని భావిస్తున్నప్పటికీ ఇది వారికి హెల్స్​ చేయదనే వాదనలున్నాయి.

- Advertisement -

ప్రతి మ్యాచ్లో వారి ఉనికి ఉన్నప్పటికీ.. బ్యాటింగ్ నిస్సందేహంగా వారి బలం అవుతుందనే అంటున్నారు పరిశీలకులు. ఇందులో డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే వంటి టాప్-ఆర్డర్ త్రయం నుండి శివమ్ దూబే వరకు.. అంతేకాకుండా లాస్ట్ ఇన్నింగ్స్ చివరిలో ధోని దంచికొట్టడం వంటివి ఆ జట్టుకు బలాలుగా చెబుతున్నారు. ఇక.. ఢిల్లీపై గెలిచి ఐదవ టైటిల్ కోసం వేటలో పోరాడాలని ధోనీ సేన ఉవ్వీళ్లూరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement