Friday, March 29, 2024

MLC Election: ఉమ్మడి ఖమ్మంలో క్రాస్ ఓటింగ్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ బలం 116 నుండి 242 చేరువైన సందర్భంలో టిఆర్ఎస్ అంతర్మథనంలో పడింది. క్రాస్ ఓటింగ్ వల్లే కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ అధినాయకత్వంపై వ్యతిరేకత ఉందా? లేక స్థానిక నేతలపై వ్యతిరేకతతో క్రాస్ ఓటింగ్ జరిగిందా..! అనే దానిపై టిఆర్ఎస్ లో అంతర్గత చర్చ జరుగుతోంది.  

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మండలాల వారీగా క్రాస్ ఓటింగ్ పై అంచనాలు వేసుకుంటున్నారు. భవిష్యత్ ఎన్నికలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందడని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement