Friday, December 6, 2024

Big Breaking | క్రిమినల్​ లవర్స్​.. వృద్ధురాలిని చంపేసి బంగారంతో ఎస్కేప్​

హైదరాబాద్​లోని హయత్​నగర్​లో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలి మర్డర్​ కేసుకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేసులో ట్విస్ట్​ని పోలీసులు బయటపెట్టారు. ఓ ప్రేమజంట తమ ఆర్థిక అవసరాల కోసం ఈ మర్డర్​కు స్కెచ్​ వేసినట్టు దర్యాప్తులో తేలింది.

హయత్​నగర్​లో వృద్ధురాలు సత్తెమ్మను గొంతుకోసి చంపిన కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. గంటల వ్యవధిలోనే మిస్టరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ప్రియుడు రాకేశ్​తో కలిసి ప్రియురాలు లలిత ఈ భారీ దోపిడీకి స్కెచ్​ వేసింది. సత్తెమ్మను చంపేసి బంగారం ఎత్తుకెళ్లారు. ఇక.. దర్యాప్తు స్పీడప్​ చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను ట్రేస్​ అవుట్​ చేశారు. వారిని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. దీంతో నిందితుల నుంచి 23 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement