Thursday, April 25, 2024

ఎన్440కే వైరస్: చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదు

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కర్నూలులో కేసు నమోదైంది. కర్నూలులో ఎన్440కే వైరస్ గుర్తించారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కర్నూలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారంటూ సుబ్బయ్య అనే న్యాయవాది కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1) (బి) (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

కాగా, రాష్ట్రంలో డబుల్ మ్యూటాంట్ ఎన్440కే వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉందని చంద్రబాబు.. జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలుకాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది అని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్ 440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని, ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement