Tuesday, April 16, 2024

ధోని 41వ పుట్టిన‌రోజు – విజ‌య‌వాడ‌లో 41అడుగుల క‌టౌట్

క్రికెట‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోని పుట్టిన‌రోజు నేడు.. కాగా ఆయ‌న 41వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో 41 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు ఏపీకి చెందిన ఆయన ఫ్యాన్స్. విజయవాడలో ధోనికి 41 అడుగుల కటౌట్ ను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. కాగా 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ధోని సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించిన షార్ట్ స్టిల్ ను ఈ కటౌట్ కోసం ఎంచుకున్నారు. సిక్స్ కొట్టి బాల్ వైపు చూస్తుంటే ధోనీని ఈ కటౌట్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు శుభాకాంక్షలతో తమ స్పందన తెలియజేశారు. ధోనీని అమితంగా ఇష్టపడే, అభిమానించే సురేష్ రేనా కూడా శుభాకాంక్షలు చెప్పారు.

నా పెద్దన్నయ్యకు హ్యాపీ బర్త్ డే అంటూ సురేష్ రైనా ట్వీట్ చేశాడు. ధోనీతో సన్నిహితంగా ఉన్న ఫొటోలతొ ఓ షార్ట్ వీడియోను రూపొందించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘‘నా జీవితంలోని ప్రతి దశలోనూ మార్గదర్శిగా ఉన్న, నా అతిపెద్ద మద్దతుదారుడికి ధన్యవాదములు. ఆ దేవుడి ఆశీస్సులతో నీవు, నీ కుటుంబం ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉండాలి’’అని రైనా ట్వీట్ పెట్టాడు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ట్విట్టర్లో స్పందిస్తూ.. ధోనీ క్రీజులో ఉన్నంత సేపూ మ్యాచ్ పూర్తి కాదు. ధోనీ వంటి వ్యక్తిని కలిగి ఉండే అదృష్టం అన్ని జట్లకు ఉండదు. రత్నం లాంటి మనిషి, ఆటగాడు అయిన ఎంఎస్ ధోనీకి హ్యాపీ బర్త్ డే. ఓమ్ హెలికాప్టరాయనమహ’’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ధోనీతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement