Friday, March 29, 2024

మూగ‌జీవాల‌కి కూడా క‌రోనా

క‌రోనా వైర‌స్ మ‌నుషుల‌కే కాదు.. జంతువులకు కూడా సోకుతుందని గుజరాత్ ప‌రిశోధ‌కులు చేసిన పరిశోధనలో తేలింది. ఇటీవలి పరిశోధనలో గేదె, ఆవు .. కుక్కలు లాంటి జంతువులలో కరోనా వైరస్ సోకిన‌ట్టు క‌నుగొన్నారు. ఇది మాత్రమే కాదు, ఈ జంతువులలో వైరస్ లోడ్ తక్కువగా ఉన్నందున ఈ వైరస్ సోకిన జంతువుల నుండి ..మ‌నుషుల‌కు ఈ వైరస్ సంక్రమించే ప్రమాదం తక్కువగా ఉంటుందని కూడా పరిశోధనలో తేలింది. కామధేను యూనివర్సిటీ .. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి గుర్రం .. ఆవు .. గేదె వరకు ముక్కు .. పురీషనాళం నుండి నమూనాలను తీసుకున్నారు. ఈ జంతువులలో 24 శాతం పాజిటివ్‌గా గుర్తించారు. కాగా ఓ కుక్క డెల్టా వేరియంట్ సోకింద‌ని గుర్తించారు. భారతదేశంలో మొదటిసారిగా ఇటువంటి పరిశోధనలు జరిగాయి, ఇందులో పాలు ఇచ్చే జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతుందని తేలింది. మునుపటి పరిశోధనలో, పిల్లులు, బీవర్స్ వంటి జంతువులకు వ్యాధి సోకినట్లు వెల్లడైంది. ఈ పరిశోధనను గుజరాత్ స్టేట్ బయోటెక్నాలజీ మిషన్ స్పాన్సర్ చేసింది. పరిశోధన డేటా ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. వాస్తవానికి, పరిశోధకులు తమ పరిశోధన కోసం 195 కుక్కలు, 64 ఆవులు, 42 గుర్రాలు, 41 మేకలు, 39 గేదెలు, 19 గొర్రెలు, 6 పిల్లులు, 6 ఒంటెలు .. 1 కోతితో సహా 413 జంతువుల నాసికా లేదా మల నమూనాలను తీసుకున్నారు. ఈ నమూనాలన్నీ అహ్మదాబాద్, ఆనంద్, గాంధీనగర్, బనస్కాంత, పటాన్, కచ్ .. మెహసానా జిల్లాల నుండి సేకరించబడ్డాయి. ఆ తర్వాత చివరి నమూనాలను మార్చి 2022లో సేకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement