Wednesday, January 19, 2022

COVID: గాంధీకి పోటెత్తిన కరోనా బాధితులు.. ఒక్కరోజే 28 మంది చేరిక!

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్‌ బాధితులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరారు. దీంతో ఆస్పత్రిలో బాధితుల సంఖ్య 111కు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరిలో మరో ఎనిమిది మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులు కూడా ఉన్నారు.

కరోనా బాధితులు మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. సాధారణ అడ్మిషన్లను, సర్జరీలను నిలిపివేశారు. ప్రధాన బిల్డింగ్‌లోని సెకండ్‌ ఫ్లోర్‌ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం మూడో వార్డును సిద్దం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News