Friday, April 26, 2024

Corona: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు

ఢిల్లీలో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ల పెరుగుదల మళ్లీ కనిపిస్తోంది. పలు ఆసుపత్రుల అడ్మిషన్లలో స్వల్ప పెరుగుదల ఉంది. అయితే.. చాలా మందికి కోమోర్బిడ్ పరిస్థితులు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీ కరోనా యాప్ ప్రకారం 9,491 COVID-19 పడకలలో, 263 (2.77 శాతం) ఫుల్​ అయ్యి ఉన్నాయి. వెంటిలేటర్లతో కూడిన 1,178 ICU పడకలలో 24 మంది అడ్మిట్​ అయ్యారు. జూన్ 8న 85 మంది ఆస్పత్రుల్లో అడ్మిట్​ అయి ఉండగా, అది కాస్తా జూన్ 15వ తేదీ వరకు 182 మంది ఆస్పత్రుల్లో చేరారు.

పక్షం రోజుల్లో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య రెండు రెట్లకు పెరిగింది. అయితే దీనిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సుమిత్ రే తెలిపారు. “ఇన్ఫెక్షన్ స్పష్టంగా ఉంది. ICU రోగుల సంఖ్య తక్కువగా ఉన్నా.. అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. మా ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఇద్దరు బాధితులు ఉన్నారు. అయితే.. ఫ్లోర్ అడ్మిషన్లు పెరిగాయి. ఒక వ్యక్తి మాత్రమే ఆక్సిజన్ సపోర్ట్ లో ఉన్నారు. అంతేకాకుండా వెంటిలేటర్‌లపై ఉన్న వారు కూడా ఉన్నారు. దీనికి కొవిడ్​ మాత్రమే కాకుండా సహసంబంధ వ్యాధులు కూడా కారణంగా చెప్పుకోవచ్చు” అని అతను చెప్పాడు.

డాక్టర్​ సుమిత్​ రే అభిప్రాయాలను GTB హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి కూడా ఆమోదించారు. జ్వర క్లినిక్‌లో అనుమానిత COVID-19 రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ల్యాబ్ పాజిటివిటీ రేటు కూడా కేసుల పెరుగుదలను ప్రతిబింబిస్తుందని చెప్పారు.  ఇద్దరిని మినహాయిస్తే ఆసుపత్రిలో చేరిన ఇతర రోగులకు వేర్వేరు ప్రాథమిక వ్యాధులు ఉన్నాయని, అయితే COVID-19 ద్వితీయ పరిస్థితి దీనికి కారణం కావచ్చు అని ఆయన అన్నారు.

‘‘కొందరికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉంది. కొంతమంది వెంటిలేటర్‌పై కూడా ఉన్నారు. ఇంకొంతమంది చనిపోయారు. అయితే మరణాలకు COVID-19 ప్రధాన కారణం కాదు’’ అని చెప్పారు డాక్టర్​ సుభాష్ గిరి.. ఇక.. టీకాలు వేయని లేదా పాక్షికంగా టీకాలు వేసుకున్న వ్యక్తులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అవగాహన లేని గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారని మరో సీనియర్ డాక్టర్ పేర్కొన్నారు. కాగా, మంగళవారం ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో 1,383 తాజా COVID-19 కేసులు నమోదయ్యాయి. వైరల్ వ్యాధి కారణంగా మరో మరణం సంభవించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement