Thursday, March 28, 2024

Spl Story: సెక్స్​వర్కర్లకు ఫేవర్​గా కోర్టులు.. ఏ తీర్పు ఎలా ఉందో ఓసారి లుక్కేద్దాం!

వ్యభిచారం అనేది ఒక వృత్తి అని, సెక్స్ వర్కర్లను గౌరవంగా చూడాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా అదే లైఫ్​ని ఎంచుకున్న  సెక్స్ వర్కర్లపై పోలీసులు ఎటువంటి జోక్యం చేసుకోవద్దని, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే.. సెక్స్ వర్కర్లకు అనుకూలంగా దేశంలో కోర్టులు తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. అయితే.. కొన్నేళ్లుగా సెక్స్ వర్కర్లకు అనుకూలంగా కోర్టులు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం.

సుప్రీంకోర్టు, ఫిబ్రవరి 2011 :

బుధదేవ్ కర్మస్కర్ వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోసెక్స్ వర్కర్లకు గౌరవంగా ఉండే హక్కు ఉందని ఫిబ్రవరి 2011న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.సెక్స్ వర్కర్లు కూడా మనుషులే కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 [జీవించే హక్కు] ప్రకారం గౌరవంగా జీవించే హక్కు ఉందని భావిస్తున్నాం. వారి ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని న్యాయమూర్తులు మార్కండేయ కట్జు, జ్ఞాన్ సుధా మిశ్రా పేర్కొన్నారు.  2011,  ఫిబ్రవరి 14 వారి నిర్ణయంలో ఈ విధంగా స్పష్టం చేశారు.

కలకత్తా హైకోర్టు, ఆగస్టు 2019:

ఆగస్ట్ 2019లో కలకత్తా హైకోర్టు అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం, 1956 ప్రకారం వాణిజ్యపరమైన సెక్స్ కోసం దోపిడీకి గురైన ఏ సెక్స్ వర్కర్‌ను నిందితురాలిగా విచారించలేమని పేర్కొంది. ఆమె సహ-కుట్రదారు అని చెప్పడానికి తగిన సాక్ష్యం ఉంటే తప్ప .. ఈ చట్టం కింద ఉన్న కేసుల్లో సెక్స్ వర్కర్లను బాధితులుగా గుర్తించాలని దర్యాప్తు అధికారులను కోర్టు ఆదేశించింది, “దర్యాప్తు సమయంలో దోపిడీకి గురైన ఏ సెక్స్ వర్కర్‌ను నిందితులుగా పేర్కొనకూడదు” అని కోర్టు తెలిపింది. ఇక.. మైనర్‌తో సహా మహిళలపై లైంగిక దోపిడీ జరిగినట్లు ఆరోపించిన వెల్‌నెస్ స్పా యాజమాన్యం ముందస్తు బెయిల్ దరఖాస్తుపై విచారణ సందర్భంగా ఆగస్టు 8, 2019న ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అనంతరం బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

- Advertisement -

బాంబే హైకోర్టు, సెప్టెంబర్ 2020 :

సెప్టెంబరు 2020న ముంబైలోని ఒక రాష్ట్ర దిద్దుబాటు సంస్థలో ఖైదు చేసిన ముగ్గురు మహిళా సెక్స్ వర్కర్లను తక్షణమే విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.చట్ట ప్రకారం వ్యభిచారం నేరం కాదని, వయోజన స్త్రీకి తన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది.  సెప్టెంబర్ 24, 2020న జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని బెంచ్ జారీ చేసిన ఆదేశం ప్రకారం.. అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం, 1956 ప్రకారం వ్యభిచారం క్రిమినల్ నేరంగా పరిగణించబడదని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు జోక్యం.. సెక్స్ వర్కర్ల జీవితాలను ఎలా మారుస్తుంది..

తమ ఇష్టానికి వ్యతిరేకంగా స్థానిక దిద్దుబాటు కేంద్రంలో తమ జైలు శిక్షను సమర్థిస్తూ మజ్‌గావ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ముగ్గురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. 2019 సెప్టెంబర్‌లో ఓ గెస్ట్ హౌస్‌పై దాడి చేసిన పోలీసులు మహిళలను పట్టుకున్నారు. మధ్యవర్తిని అదుపులోకి తీసుకుని చట్టం కింద కేసు నమోదు చేశారు.

సుప్రీంకోర్టు, సెప్టెంబర్ 2020 :

సెప్టెంబర్ 29, 2020న సుప్రీంకోర్టు కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో సెక్స్ వర్కర్లకు ఆహారాన్ని సరఫరా చేయాలని అన్నిరాష్ట్రాలను ఆదేశించింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో) గుర్తించిన సెక్స్ వర్కర్లకు ఎలాంటి గుర్తింపు రుజువు అవసరం లేకుండా డ్రై రేషన్ అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వాటి పనితీరుపై స్టేటస్ రిపోర్టును కూడా కోరింది. ఇంతకు ముందు జరిగిన విచారణలో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రభుత్వం వారిని సంప్రదించి వారికి ఆహారం అందించాల్సిన అవసరం ఉందని బెంచ్ కమ్యూనిటీ పరిస్థితిని హైలైట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement