Friday, March 15, 2024

కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో పెళ్లిళ్లు

కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. చిన్నారులు ఆన్‌లైన్ క్లాసులు వింటుంటే.. పెద్దవాళ్లు జూమ్ మీటింగ్‌లు, వెబినార్‌లకు హాజరవుతున్నారు. కాగా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా చాలా మంది పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు బయటకు వెళ్లకుండానే కరోనా ఆంక్షలు పాటిస్తూ ఇంట్లోనే పెళ్లి చేసుకుంటున్నారు.

మెదక్ జిల్లాలో ఆన్‌లైన్‌లో పురోహితుడు మంత్రాలు చదవగా.. పెళ్లి జరిగింది. పాపన్నపేట మండలం అంబ్రియా పంచాయతీలోని సోమ్లాతండాకు చెందిన బానోతు శివరాం కుమార్తె మంజులకు, టేక్మాల్ మండలం భీమ్లాతండాకు చెందిన మోహన్‌తో సోమవారం రోజు పెళ్లి జరిగింది. అయితే పెళ్లికూతురు మంజుల ఉంటున్న గ్రామంలో ఓ యువకుడు కరోనాతో చనిపోయాడు. దీంతో పెళ్లి జరిపే పంతులు గ్రామానికి రావడానికి భయపడటంతో తమ కుమార్తె పెళ్లిని ఆన్‌లైన్‌లో జరపాలని వధువు కుటుంబీకులు భావించారు. ఈ నేపథ్యంలో పంతులు తన నివాసం నుంచే ఫోన్‌లొ వేదమంత్రాలు చదవడంతో పాటు పెళ్లి తతంగాన్ని ఎలా జరపాలో సూచించాడు. ఆయన ఆదేశాలు పాటిస్తూ వధూవరులు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement