Saturday, April 20, 2024

UP: స్కూటీతో సహా మ్యాన్​హోల్​లో పడిపోయిన జంట.. యూపీ పోలీసు ఆఫీసర్​గా గుర్తింపు​

వరదలతో నిండిన వీధిలో స్కూటీపై వెళుతున్న ఓ జంట తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని కిషన్‌పూర్‌లో జరిగింది. ఈ వీడియోలో స్కూటీపై ఒక జంట కాలిబాట పక్కన పార్క్ చేయడానికి వరద నీరు ఉన్న వీధి గుండా వెళుతుండగా, వాహనం, దానిపై ఉన్నవారు ఒక మ్యాన్​హోల్​లో పడిపోయారు. అంతలోనే అక్కడ ఉన్న చాలామంది వారికి సహాయం చేయడానికి పరుగెత్తడం కనిపిస్తుంది. వారిని సురక్షితంగా ఆ మ్యాన్​హోల్​ నుంచి బయటికి తీశారు కానీ, స్కూటీ మాత్రం కనిపించడం లేదు.

ఈ ఘటనలో బాధితులు యూపీ పోలీసు అధికారి దయానంద్ సింగ్ అత్రి , అతని భార్య అంజు అత్రిగా గుర్తించారు. వారిద్దరూ డాక్టర్‌ని చూడటానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ‘‘నా ముందున్న రహదారి వరద నీటితో ఉంది. నేను ఆ గొయ్యిని చూడలేక అందులో పడిపోయాను” అని దయానంద్ సింగ్ అత్రి తెలిపారు.

వర్షాకాలంలో ఈ ప్రాంతంలో రోడ్లు తరచూ జలమయం అవుతుంటాయి.. ఫలితంగా గతంలో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ గొయ్యి గతంలో అనేక ప్రమాదాలకు మూలమైనప్పటికీ, మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకోవడం లేదని అంబులెన్స్ డ్రైవర్ వినోద్ కుమార్ చెప్పారు. అయితే ఈ ప్రమాదంపై తెలంగాణలోని చాలామంది రియాక్ట్​ అవుతున్నారు. డబుల్​ ఇంజిన్​ ఇంపాక్ట్​ అంటే ఇట్లనే ఉంటదా?  డబుల్​ ఇంజిన్​ డెవల్​ మరీ ఇంత ఘోరంగా ఉంటదా అని కామెంట్స్​  చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement