Saturday, April 20, 2024

LIVE UPDATES: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకేత్తిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సొం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు పలు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. ఐదుచోట్ల కలిపి మొత్తం 822 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉండగా.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అటు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నికల ఫలితాలకు కూడా కౌంటింగ్ జరుగుతోంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో 164 స్థానాల ట్రెండ్స్ వచ్చాయి. టీఎంసీ 83 స్థానాల్లో, బీజేపీ 79 స్థానాల్లో, లెఫ్ట్ పార్టీలు 2 స్థానాల్లో ముందున్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా, 94 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడ్డాయి. విపక్ష డీఎంకే 54 చోట్ల, అన్నాడీఎంకే కూటమి 40 చోట్ల ముందంజలో ఉన్నాయి.

కేరళ విషయానికి వస్తే, 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, ప్రస్తుతం 121 చోట్ల ట్రెండ్స్ వచ్చాయి. ఎల్డీఎఫ్ 65 చోట్ల, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 48 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అసోంలో 126 స్థానాలుండగా, 55 నియోజకవర్గాల ఓటింగ్ సరళి బయటకు వచ్చింది. బీజేపీ 32 చోట్ల, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా, ప్రస్తుతానికి ఎన్ఆర్సీ 5, కాంగ్రెస్ కూటమి 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

తమిళనాడులో DMK దూసుకుపోతోంది. అధికారం కోసం తమిళనాడు అసెంబ్లీలో కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను DMK దాటింది. డీఎంకే దెబ్బకు పలువురు అన్నాడీఎంకే మంత్రులు పరాజయం దిశగా సాగుతున్నారు. మంత్రులు జయకుమార్, రాజేంద్ర బాలాజీ, ఓఎస్ మణియన్, సీవీ షణ్ముగం వెనుకంజలో ఉండగా.. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కేవలం 200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. డీఎంకే ధాటికి కమల్ హాసన్, టీటీవీ దినకరన్, విజయకాంత్ పార్టీలు పత్తా లేవు.

కేరళలో అధికార LDF విజయం దిశగా దూసుకెళ్తోంది. UDFపై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్​ నేతృత్వంలోని LDF 90 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ తరఫున నిమోమ్​ నుంచి పోటీ చేసిన కుమ్మనమ్ రాజశేఖరన్, పాలక్కడ్ అభ్యర్థి మెట్రో మ్యాన్​ శ్రీధరన్ మాత్రం ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. బెంగాల్‌లో TMC ఇప్పటివరకు 51 శాతం ఓట్లు సాధించింది. అటు, అధికారం కోసం టీఎంసీతో తీవ్రంగా తలపడిన భాజపాకు 35 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం టీఎంసీ 153 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, భాజపా 118 స్థానాల్లో, వామపక్ష కూటమి కేవలం 5 స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement