రహస్యస్థావరంలో ఉన్న లాల్ మొహమ్మద్ అలియాస్ మొహమ్మద్ దర్జీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈయన దేశంలోనే అతి పెద్ద నకిలీ కరెన్సీ సరఫరాదారుడు. ఇతని వయసు 55సంవత్సరాలు. నేపాల్‌లోని ఖాట్మండులో ఒక రహస్య స్థావరం వెలుపల ఐఎస్ఐ ఏజెంట్ లాల్ మహ్మద్‌ను కాల్చి చంపిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి ఏజెంట్‌గా పనిచేస్తున్న దేశంలోనే అతి పెద్ద నకిలీ కరెన్సీ సరఫరాదారుడైన లాల్ మొహమ్మద్ అలియాస్ మొహమ్మద్ దర్జీ సెప్టెంబర్ 19న నేపాల్‌లోని ఖాట్మండులో అతని రహస్య స్థావరం వెలుపల కాల్చి చంపబడ్డాడు. భారతదేశంలో నకిలీ నోట్లను అత్యధికంగా సరఫరా చేసే వ్యక్తి అని ఇంటెల్ ఏజెన్సీలు మీడియాకు తెలిపాయి. అతన్ని కాల్చి చంపిన సంఘటన అక్కడి కెమెరాలో రికార్డు అయింది. ఐఎస్‌ఐ సూచన మేరకు లాల్ మహ్మద్ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి నకిలీ భారత కరెన్సీని నేపాల్‌కు తరలించి అక్కడి నుంచి భారత్‌కు సరఫరా చేసేవాడు. లాల్ మహ్మద్ కూడా లాజిస్టిక్స్ మద్దతుతో ఐఎస్‌ఐ సహాయం చేసాడు. అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం D-గ్యాంగ్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా తెలిపారు. అలాగే, ఇతర ISI ఏజెంట్లకు కూడా ఆశ్రయం కల్పించాడని తెలిపారు అధికారులు.
నకిలీ కరెన్సీ సరఫరాదారుడు మొహమ్మద్ దర్జీపై కాల్పులు-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Advertisement
తాజా వార్తలు
Advertisement