Friday, April 26, 2024

ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్ కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కాస్ట్యూమ్ కృష్ణ ఇవాళ మృతి చెందారు. నిన్న ఆరోగ్యం విషమించడంతో.. ఇవాళ ఉదయం మరణించారని సమాచారం అందుతోంది. చెన్నైలో అనారోగ్యంతో కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందినట్లు సమాచారం. ఇక విజయనగరం జిల్లా, లక్కవరపు కోటలో జన్మించిన కృష్ణ.. చాలా సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు.

1980ల్లో వచ్చిన అనేక మంది అగ్ర హీరోల సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్‌ అందించారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్‌ బంద్‌’ సినిమాతో కాస్ట్యూమ్స్‌ కృష్ణ నటుడిగా పరిచయమయ్యారు. . ఆ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ విలన్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత విలన్‌, సహాయ పాత్రల్లో నటించారు. పెళ్లి పందిరి సహా 8 చిత్రాలకు నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement