Wednesday, April 24, 2024

‘నోటి’ ద్వారా క‌రోనా వ్యాక్సిన్

క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు. కార‌ణం సూది మందు కావ‌డం. మ‌రి సూదిలేకుండా వ్యాక్సిన్ వేస్తే…అదెలా అనుకుంటున్నారా..నోటి ద్వారా ..ఇచ్చే క‌రోనా వ్యాక్సిన్ ని రెడీ చేస్తుంది ఒరా వ్యాక్స్ సంస్థ‌. అమెరికా/ఇజ్రాయిల్ దేశానికి చెందిన మెడిసిన్ కంపెనీ ఒరా మేడ్ అనుబంధ సంస్థ ఒరా వ్యాక్స్ రూపొందించిన ఈ మందు పై దక్షిణాఫ్రికాలో మొదటి విడత క్లినికల్ ప్రయత్నాలు మొదలయ్యాయి.ఈ దేశంలో అనేకమంది టీకాల పట్ల విముఖత ప్రదర్శిస్తారు.

ఈ నేపథ్యంలో ఇంజక్షన్లతో తావులేని పీక వల్ల వ్యాక్సినేషన్ సులువు అవుతుందని ఒరా మేడ్ సీఈఓ నడాన్ కిద్రొన్ చెప్పారు. ఇది వైరస్/ పార్టీ కిల్స్ టీకా. గతంలో కరోనా టీకా పొందనివారు… ఈ వ్యాధి బారిన పడని వారిని తాజాగా ప్రయోగాల కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. రెండు రోజుల్లో దీన్ని ఇస్తామని.. రెండిటి మధ్య మూడు వారాల విరామం ఉంటుందని చెప్పారు. కరోనా వైరస్ లోని మూడు రకాల ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు వారు వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement