Wednesday, April 24, 2024

ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్‌కు క‌రోనా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుస్తూ వస్తున్నాయి. అయితే తాజా… ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్‌కు క‌రోనా వైరస్ సోకింది. వైర‌స్ ప‌రీక్ష‌లో ఆయ‌నకు పాజిటివ్‌గా వచ్చింది. వైర‌స్ సోక‌డంతో ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఫ్లూ లాంటి ల‌క్ష‌ణాల‌తో పాటు జ్వ‌రం కూడా ఉన్న‌ట్లు మారిస‌న్ తెలిపారు. హెల్త్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతున్నానని, సిడ్నీలోని త‌న ఇంట్లో ఐసోలేట్ అయిన‌ట్లు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఐసోలేష‌న్‌లో ఉంటూనే త‌న విధుల‌ను నిర్వ‌ర్తించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement