Friday, March 29, 2024

మరో రెండేళ్ల పాటు కరోనా ముప్పు..అక్టోబరు నాటికి థర్డ్‌ వేవ్..

భారత్‌లో అక్టోబరు నాటికి కరోనా థర్డ్‌  వేవ్‌ రానున్నట్లు 21 మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్‌ వేవ్‌ ముప్పు సాధ్యాసాధ్యాలపై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఓ సర్వే నిర్వహించింది.  జూన్‌ 3-17 మధ్య జరిగిన ఈ సర్వేలో వైద్యులు, ఆరోగ్యసంరక్షణా నిపుణులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడెమాలజిస్టులు, ప్రొఫెసర్లు మొత్తం 40 మంది ప్రముఖులు పాల్గొన్నారు. భారత్‌లో అక్టోబరు నాటికి కరోనా థర్డ్‌  వేవ్‌ రానున్నట్లు 21 మంది నిపుణులు హెచ్చరించారు. మరో ముగ్గురు ఆగస్టు నాటికి.. మరో 12 మంది సెప్టెంబరు కల్లా భారత్‌లో మరోసారి కరోనా విజృంభించొచ్చని అంచనా వేశారు. ఇక మిగిలిన ముగ్గురు నవంబరు-డిసెంబరు మధ్య థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని తెలిపారు.

అయితే, రెండో దశ కరోనాతో పోలిస్తే థర్డ్‌ వేవ్‌ను నియంత్రించగలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని 34 మందిలో 24 మంది అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్‌, ఆసుపత్రుల్లో పడకలు వంటి వసతులు మెరుగుపడ్డాయని లేదంటే థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఘోరంగా ఉండి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇక మూడో దశ ముప్పు పిల్లలపై అధిక ప్రభావం చూపనుందా అన్న ప్రశ్నకు 40లో 26 మంది అవుననే తెలిపారు. వారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడమే అందుకు కారణమని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌’ ఎపిడెమాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ప్రదీప్‌ బనదూర్‌ అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తులో రాబోయే కరోనా వేరియంట్లు వ్యాక్సిన్లను నిరుపయోగంగా మార్చే అవకాశాలు తక్కువేనని 38 మందిలో 25 మంది నిపుణులు తెలిపారు. అలాగే మరో ఏడాది పాటు భారత్‌లో కరోనా ముప్పు ఉండనుందని 30 మంది నిపుణులు హెచ్చరించారు. మరో 11 మంది కరోనా ప్రభావం దేశంలో ఏడాది కంటే తక్కువేనని.. 15 మంది రెండేళ్ల లోపేనని.. 13 మంది రెండేళ్లపైనే ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇద్దరైతే కరోనా ముప్పు ఎప్పటికీ కొనసాగే ప్రమాదం ఉందని అంచనా వేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement