Wednesday, March 27, 2024

కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ.. కీలక ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు.. కేర్​ తీస్కోవాలంటున్న కేంద్రం

రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇక థర్డ్‌వేవ్ అయిపోయింది.. జర నిమ్మలం అవుదామనుకుంటున్న ప్రజలకు బ్యాడ్​ న్యూస్​ చెబుతున్నారు సైంటిస్టులు. కేంద్ర సర్కారు కూడా ఇదే విషయాన్ని మరీ మరీ చెబుతోంది. రాష్ట్రలు అప్రమత్తంగా ఉండాలని, అస్సలు నిర్లక్ష్యం వహించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. కాగా, థర్డ్​ వేవ్‌లో పాజిటివ్‌ కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఇప్పుడు ఫోర్త్‌వేవ్‌ (4th Wave) ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ వేవ్‌లో కరోనా (Corona) ఎలా ఉంటుందనేది ఆందోళన వ్యక్తం అవుతుంది. సెకండ్‌వేవ్‌ నుంచి థర్డ్‌వేవ్‌ వరకు దాదాపు 6 నెలల గ్యాస్‌ తీసుకున్న కొవిడ్‌.. ఈ సారి 4 నెలలకే రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఈ థర్డ్‌వేవ్‌తో కరోనా పీడ వదిలిపోతుందని అనుకునే లోపే శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు. నాలుగోవేవ్‌కు నాలుగు నెలలే సమయం ఉందని, వచ్చే జూన్‌లో ఫోర్త్‌వేవ్‌ ఎంట్రీ ఇచ్చి అక్టోబర్ దాకా కొనసాగుతుందని అంచనా వేశారు. భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలో థర్డ్‌వేవ్‌ దాదాపు ముగిసినట్లే. ఇప్పుడు నాలుగో వేవ్‌ దశ జూన్‌ 22 నాటికి ప్రారంభం అవుతుందని తాజాగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. నాలుగో వేవ్.. నాలుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేశారు. అయితే నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు.

బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్‌ తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలిపారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయన్నారు వెల్లడించారు. దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. ముఖ్యంగా కరోనా థర్డ్‌వేవ్ విషయంలో కొద్ది రోజుల తేడాతో దాదాపు కచ్చితమైన అంచనా వేసింది ఐఐటీ కాన్పూర్‌ సైంటిస్టులు మాత్రమే. అయితే కరోనా నిబంధనలు పాటిస్తుంటే థర్డ్‌వేవ్‌లో కూడా కేసులు పెద్దగా నమోదు కావని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా కట్టడికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించడం ముఖ్యమంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement