Tuesday, April 16, 2024

పలు ఆలయాల్లో నిలిచిపోయిన నిత్యాన్నదానం

ఏపీలో కరోనా మునుపటిలా కోరలు చాస్తుండటంతో మళ్లీ భయాందోళనలు ప్రారంభమయ్యాయి. దీంతో అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఆలయాల నిర్వాహకులు కరోనా వైరస్‌ నివారణకు పలు ఆంక్షలు విధిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోవిడ్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కనకదుర్గమ్మ ఆలయంలో నిత్యాన్నదానం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

దేవాదాయశాఖ ఆదేశాల మేరకు అన్నదానం ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. అయితే అమ్మవారి ప్రసాదం మాత్రం భక్తులకు ప్యాకెట్‌ రూపంలో అందిస్తామని వెల్లడించారు.

ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా ద్వారక తిరుమల, శ్రీశైలం ఆలయాల్లోనూ నిత్య అన్నదానం ప్రక్రియను నిలిపివేసి ప్రసాదాన్ని భక్తులకు ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రధాన ఆలయాల్లో సైతం కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నదాన వితరణలను ఆపివేసి ఫుడ్ ప్యాకెట్లను అందించాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement