Thursday, March 28, 2024

తెలంగాణలో థియేటర్లు మళ్లీ బంద్?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లు మూసివేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తాత్కాలికంగా సినిమా హాళ్లు మూసివేయాలని ప్రతిపాదనలో కోరింది. ఒకవేళ అది కుదరకపోతే 50% సీట్లకే అనుమతి ఇవ్వాలని సూచించింది. థియేటర్లలో కరోనా పెరిగే ప్రమాదం ఉందని, అందుకే త్వరలో థియేటర్ల మూసివేతపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కొత్త సినిమాలు విడుదలైతే 90 శాతం ప్రేక్షకులు థియేటర్లలో ఉంటున్నారని.. మాస్కులు పెట్టుకోకుండా పక్కపక్కనే కూర్చుంటున్నారని పేర్కొంది. తలుపులు మూసేసి ఏసీలు వేస్తుండటంతో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపింది. అలాగే జిమ్‌లు, పార్క్‌లపై కూడా నిర్ణయం తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించింది. కాగా సరిగ్గా ఏడాది కిందట అంటే మార్చి రెండో వారంలో లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడి డిసెంబరులో మళ్లీ పున:ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement