Saturday, April 20, 2024

యూపీలో ఆదివారం లాక్‌డౌన్..

యూపీలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.కరోనా కేసుల కట్టడికి అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన ఫలితం ఉడటం లేదు. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అరికట్టడానికి ఆదివారం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ రాష్ట్రమంతటా వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు. మిగితా దుకాణాలు, షాపులు, మాల్స్.. ఇలా అన్నీ మూసేయాలని ఆదేశించారు. అంతేకాదు ప్రజలందరు విధిగా మాస్కులు ధరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే వారణాసిలో మాత్రం శని, ఆదివారాల్లో లాక్‌డౌన్ ఉంటుంది. ఈ రెండు రోజులు పూర్తి లాక్‌డౌన్ ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే పాలు, పెరుగు, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 10 గంటల నుంచి తెరిచి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement