Thursday, April 25, 2024

తెలంగాణలో కొత్తగా 1,280 కరోనా కేసులు..

తెలంగాణ కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,280 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 2,261 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 6,03,369కి పెరిగాయి. ఇవాళ్టి వరకు మొత్తం 5,78,748 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 21,137 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,484కు చేరాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 91,621 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement