Thursday, March 28, 2024

తెలంగాణలో రికార్డు స్థాయి లో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మహమ్మారి ప్రభావంతో మృతి చెందారు. అదే సమయంలో 293 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,140 గా ఉంది.  మొత్తం కరోనా మరణాల సంఖ్య 1717. ప్రస్తుతం రాష్ట్రంలో 7,923 కొవిడ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 3,866 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 62,973 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 320 కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement