ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ చనిపోయారు. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్లైన్లో ఉన్న గూడ్స్ బండిని గుద్దుకోవడంతో పెను ప్రమాదానికి దారితీసింది. అయితే.. లోకోపైలట్ మహంతి రెండూ కాళ్లు తెగిపడ్డాయి. అతడిని భువనేశ్వర్‌లోని ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. కాగా, రెండ్రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవ్వాల తుదిశ్వాస విడిచినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.
- Advertisement -