Thursday, March 28, 2024

Big Breaking | పట్టాలు తప్పిన కోర‌మండ‌ల్ ఎక్స్​ప్రెస్​.. 50 మంది ప్రయాణికులు మృతి (వీడియో)

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్ర‌మాదం జ‌రిగింది. బ‌హ‌నాగ స్టేష‌న్‌లో ఆగివున్న గూడ్స్ రైలును కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ముందుగా పట్టాలు తప్పిన ఈ రైలు.. పక్కనే లూప్ లైన్​లో ఆగి ఉన్న గూడ్స్​ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్ర‌మాదంలో ఇప్పటికే దాదాపు 400 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 50 మంది చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం. కాగా, క్షతగాత్రుల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. క్ష‌త‌గాత్రుల‌ను సోరో, గోపాల్‌పూర్‌, ఖంట‌పాడ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఇందులో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

ఇక‌.. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న ఎన్‌డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయ‌క చర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. రైల్వే అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. బోగీల్లో ఇరుక్కున్న వారిని బ‌య‌ట‌కు తీస్తున్నారు. గూడ్స్ రైలును ఢీకొన‌డంతో కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏడు బోగీలు బోల్తా ప‌డ్డాయి. ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌మాద ఘ‌ట‌న నేప‌థ్యంలో రైల్వే పోలీసులు హెల్ప్‌లైన్ నంబ‌ర్లు ప్ర‌క‌టించారు. 044-2535 4771, 67822 62286, బెంగాల్ హెల్ప్ లైన్ నంబ‌ర్లు – 033 – 2214 3526, 2253 5185.

- Advertisement -

కాగా, మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సహాయక చర్యల్లో వైమానిక దళం సిబ్బంది కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో హవ్‌డా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. బాలేశ్వర్‌ జిల్లా బహనాగ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద సాయంత్రం 7.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో 12 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. 50 మందికి పైగా ప్రయాణికులు మరణించినట్లు సమాచారం. మరో 170 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కోరమండల్ ఎక్స్​ప్రెస్​ ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టిందని తొలుత వార్తలు వచ్చాయి. వాటిని ఖండించిన రైల్వే శాఖ.. దర్యాప్తు చేపడతున్నట్లు తెలిపింది.

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తరలించేందుకు భద్రక్‌ నుంచి అనేక అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. బాలేశ్వర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 06782262286కు ఫోన్‌ చేయాలని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు.

బంగాల్‌- ఒడిశా- ఆంధ్రప్రదేశ్‌- తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు షెడ్యూల్‌ ప్రకారం ప్రతిరోజు షాలిమార్‌లో మధ్యాహ్నం 3.20గంటలకు బయల్దేరుతుంది. సంత్రగాచి జంక్షన్‌, ఖరగ్‌పూర్‌ జంక్షన్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, జాస్పూర్‌ కె రోడ్‌, కటక్‌, భువనేశ్వర్‌, ఖుర్దా రోడ్‌, బ్రహ్మపూర్‌, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా మరుసటి రోజు సాయంత్రం 4.50గంటలకు చెన్నైకు చేరుకుంటుంది.రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురికావడంపై బంగాల్​ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు బాలేశ్వర్‌ వద్ద ఈ సాయంత్రం గూడ్సు రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెబుతూ.. 033-22143526/22535185 నంబర్లను ఆమె షేర్‌ చేశారు. ఘటనా స్థలానికి 5-6 సభ్యుల బృందంతో పాటు రైల్వే అధికారులను పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులతో కలిసి తాను వ్యక్తిగతంగా అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు దీదీ చెప్పారు.

ఇక.. రైలు ప్రమాదం నేపథ్యంలో విశాఖకు వచ్చే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement