Friday, March 29, 2024

Breaking: సైనా నెహ్వాల్‌పై వివాదాస్పద ట్వీట్‌.. నటుడు సిద్ధార్థ్ కు సమన్లు జారీ

ఇండియన్ షట్లర్ సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌ ఆ మధ్య బాగా వివాదాస్పదమయ్యింది. ‘‘షటల్ కాక్’’ అని ద్వంద్వార్థమచ్చేలా సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు ఎదురయ్యాయి. అంతేకాకుండా అన్ని వర్గాల వారు సైనాకి సపోర్ట్ గా నిలిచారు. దీంతో సిద్ధార్థ్ సైనా నెహ్వాల్ కు సారీ చెబుతూ లేఖ రాశారు.

అసలు తన ఉద్దేశం అదికాదని ఆ లేఖలో వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించి నటుడు సిద్ధార్థ్ కు చెన్నై కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ట్వీట్ వివాదంపై సిద్ధార్థ్ పై రెండు ఫిర్యాదులు అందినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement