Thursday, March 28, 2024

AI | కృత్రిమ మేధపై నియంత్రణ.. కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడి

టెక్‌ రంగంలో కృత్రిమ మేథ ఎంత సంచలనం సృష్టించిందో, అంతే ఆందోళనకు కారణమవుతోంది. కృత్రిమ మేథ (ఏఐ) అనేక రంగాల్లోకి ప్రవేశిస్తోంది. విద్యా, వైద్యం నుంచి వ్యవసాయ రంగం వరకు అనేక రంగాల్లో ఏఐదే హవా నడుస్తోంది. చాట్‌జీపీటీ వంటి సాంకేతికత దీని ఆధారంగానే పని చేస్తోంది. కృతిమ మేథతో భవిష్యత్‌లో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని, మానిషి ఉనికికే ప్రమాదం వస్తుందన్న హెచ్చరికలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. భారత్‌లో డిజిటల్‌ వినియోగదారులకు హాని కలిగించకుండా ఉండేలా కృత్రిమ మేథ ను కేంద్రం నియంత్రిస్తుందని ఆయన ప్రకటించారు.


దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 85 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 120 కోట్లకు పెరుగుతుందని అంచాన. మరో వైపు సైబర్‌ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. వినియోగదారులకు హాని కలిగించే చర్యలను ప్రభుత్వం అడ్డుకుంటుందని మంత్రి వెల్లడించారు. సైబర్‌ స్పేస్‌లో భద్రతను నిర్ధారించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దశాబ్ద కాలంలో డిజిటల్‌ టెక్నాలజీలో భారత్‌ చాలా పురోగతి సాధించిందని చెప్పారు. చాట్‌జీపీటీ రూపకర్ల ఓపెన్‌ఏఐ కంపెనీ సీఈఓ శామ్‌ అల్ట్‌మన్‌ గురువారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భారత టెక్‌ రంగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement