Saturday, April 13, 2024

పోన్‌పే త‌ర‌హాలో ‘కాంట్రాక్ట్ పే 18000 కోట్లు’.. మునుగోడులో వాల్‌పోస్ట‌ర్లు.. అభ్యంతరం తెలిపిన పోన్​ పే!

మొన్న క‌ర్నాట‌క‌, ఇవ్వాల న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు.. సేమ్ టు సేమ్ ఇట్ల‌నే జ‌రిగింది. అయితే.. అక్క‌డ పేటీఎం, ఇక్కడ మాత్రం పోన్ పే.. ఇదంతా ఏంట‌నే డౌట్ వ‌స్తుంది క‌దా.. ఇప్పుడు సోష‌ల్ మీడియా హ‌వా న‌డుస్తోంది క‌దా.. ఎవ‌రు ఎట్లాంటి వార‌నే విష‌యాలు.. వివ‌రాలు క్ష‌ణాల్లో ప్ర‌జ‌ల‌కు తెలిసిపోతున్నాయి. మంచి చేస్తున్న‌ది ఎవ‌రు, చెడుగా మాట్లాడుతున్న‌ది ఎవ‌ర‌న్న‌దానిపై గ్రౌండ్ లెవ‌ల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు కూడా జరుగుతున్నాయి.

ఇక‌..మొన్నటికి మొన్న క‌ర్నాట‌క సీఎం బ‌స్వ‌రాజు బొమ్మై 40శాతం క‌మీష‌న్లు తీసుకుంటార‌ని ‘పేటీఎం’కు బదులుగా ‘పే సీఎం 40%’ అని వాల్ పోస్టర్లు అంటించారు.. అట్లాంటి ఘటనే ఇప్పుడు మునుగోడులో కనిపించింది. మునుగోడు లోని చండూరు టౌన్ లో Phone Pay తరహాలో Contract Pe, 18000 కోట్లు Transaction కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కేటాయించడం జరిగిందని వేల సంఖ్యలో షాపులకు, గోడలకు రాత్రికి రాత్రి వాల్​ పోస్టర్లు వెలిశాయి.. ఏంటో ఇది.. నిజమేనంటారా?.. కాదంటారా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి..

మునుగోడు కాంట్రాక్ట్​ పే పోస్టర్లపై పోన్​ పే అభ్యంతరం..

- Advertisement -

“‘Contract Pe’పై కొన్ని ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలతో PhonePeకు ఎలాంటి సంబంధం లేదని పోన్​పే స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియా ఓ విజ్ఞాపన మెస్సేజ్​ని పంపింది. ‘‘మా కంపెనీకి ఏ పార్టీతో కానీ, అభ్యర్థితో కానీ ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. ‘Contract Pe’ను రూపొందించడంలో PhonePe యొక్క లోగోను ఉపయోగించడం అనేది తప్పుదారి పట్టించేది మాత్రమే కాక, PhonePe యొక్క మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించడం కూడా అవుతుంది. దీనికి సంబంధించి భవిష్యత్తులో తగిన చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు PhonePe కలిగి ఉంది.” అని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement