Wednesday, April 24, 2024

ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌.. ఢిల్లీ చేరిన కాంగ్రెస్ పంచాయితీ, రాహుల్ ముందే అమీతుమీకి లీడర్లు రెడీ!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు హస్తిన బాట పట్టారు. కొందరు నాయకులు ఇప్పికే ఢిల్లీకి చేరగా, మరి కొందరు సోమవారం బయలుదేరనున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో జరిగే సమావేశంలో సీనియర్లందరు హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మానిక్యం ఠాగూర్‌తో పాటు ఏఐసీసీ ఇన్‌చార్జీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్‌ కృష్ణణ్‌లు కూడా సీనియర్లకు స్వయంగా ఫోన్లు చేసి రాహుల్‌తో జరిగే భేటీకి ఆహ్వానించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి చెందిన దాదాపు 30 మంది సీనియర్లతో రాహుల్‌గాంధీ భేటీ కావడం ఇదే ప్రథమమని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల్లో నెలకొన్న విబేదాలపై ఢిల్లీ పెద్దలకు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని, తమను పట్టించుకోవడం లేదని కొంత మంది సీనియర్లు ఫిర్యాదు చేయగా, పార్టీ బలోపేతం కోసం రేవంత్‌రెడ్డి కష్టపడుతుంటే సీనియర్లు అడ్డుపడుతున్నారని రేవంత్‌రెడ్డి వర్గీయులు ఫిర్యాదులు చేసుకున్నారు.

అంతే కాకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మానిక్యం ఠాగూర్‌ కూడా పార్టీ నాయకులందరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవడం లేదని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇలాంటి సమయంలో పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నాయకులందరు ఐక్యంగా ముందుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని భావనతో నాయకులను ఢిల్లిdకి పిలిచారు. రాహుల్‌గాంధీతో జరిగే ఈ భేటీకి టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ సీఎల్పీ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు, టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు అనుబంధ విభాగాల చైర్మన్లు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో పాటు మిగతా కొందరు సీనియర్లకు , మాజీ మంత్రులకు కూడా ఈ భేటీకి అవకాశం ఇవ్వాలని గాంధీభవన్‌ నుంచి రాహుల్‌గాంధీ కార్యాలయానికి విజ్ఞప్తి వెళ్లింది. అయితే 30 మంది కంటే ఎక్కువగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం కుదరదని రాహుల్‌గాంధీ కార్యాలయం స్పష్టం చేసినట్లుగా తెలిసింది.

ఈ భేటీతోనైనా పంచాయతీకి ముగింపు పలుకుతుందా..?
రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత పార్టీ నాయకుల్లో నెలకొన్న విభేదాలు ముగుస్తాయా..? ఆ తర్వాత నాయకులందరు ఏకతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తారా..? లేక ఎప్పటిలాగే ఉంటుందా..? అనేది సొంత పార్టీలోనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువని, ఎవరేమి మాట్లాడినా చెల్లుతుందనే భావన నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే దోరణి భవిష్యత్‌లో కొనసాగితే ప్రజల్లో నమ్మకం కోల్పోతామని, తద్వారా మరోసారి చేదు ఫలితం అనుభవించాల్సి వస్తుందనే భయం పార్టీ కేడర్‌లో నెలకొన్నది. పాత సంస్కృతికి పుల్‌స్టార్‌ పెడుతారా..? లేక అదే పద్దతిని ఫాలో అవుతారా..? అనేది చర్చగా మారింది. అయితే రాహుల్‌గాంధీ చేసే సూచనలు, ఆదేశాలను ధిక్కరిస్తే ఇక చర్యలుంటాయనే వాదన కూడా వినిపిస్తోంది.

రైల్లో బయలుదేరిన జగ్గారెడ్డి..
టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నామే రైల్‌లో ఢిల్లిdకి బయలుదేరి వెళ్లారు. అయితే ఫ్లైట్‌లో ప్రయాణానికి జగ్గారెడ్డి ఎప్పుడు దూరంగా ఉంటారని, అందుకే రైల్‌ ప్రయాణం చేస్తుంటారని చెబుతున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యతో పాటు మరి కొంత మంది నాయకులు రెండు, మూడు రోజుల క్రితమే ఢిల్లిdకి చేరుకున్నారు. ఇకపోతే మిగతా నాయకులు సోమవారం వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement