Saturday, April 20, 2024

కొలువుల కోసం కొట్లాడుదాం- భట్టి

నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో సునీల్ నాయక్ లాంటి మరణాలు జరగడానికి ఇక ఏ మాత్రం వీలులేదన్నారు. తక్షణం ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గరిష్ట వయోపరిమితిని కూడా పెంచి భర్తీ పక్రియను వెంటనే చేపట్టాలన్నారు. సునీల్ నాయక్ మృతి  అత్యంత బాధాకరం, విషాదకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్ర కలతకు గురిచేసిందని భట్టి అన్నారు.

నిరుద్యోగ యువత ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, పోరాడి అన్నిటినీ సాధించుకుందాం అని భట్టి విజ్ఞప్తి చేశారు. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టంలో ఆత్మబలిదానాలు అత్యంత విచారకరమన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ స్థానంలో వున్నారంటే కారణం వందలాదిమంది ప్రాణాత్యాగాల ఫలితమన్నారు. ప్రత్యేక రాష్ర్టం సాధించుకున్న తరువాత కూడా గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణాలో ఉద్యోగాల భర్తీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారని, ఉద్యోగ నియామకాలు యువత ఆశించినంతగా, ముఖ్యమంత్ర
చెప్పినట్లుగా  జరగడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామన్నారు. రాష్ట్ర బడ్జెట్ భ్రమల్లో ముంచెత్తుతుందరి విమర్శించారు. అప్పుల ఊబిలో తెలంగాణ కొట్టుమిట్టాడుతోందన్నారు.  సంక్షేమ రంగాలకు కేటాయిస్తున్న కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం విధించే పన్నులు భారం ప్రజలు మోయలేనిదిగా ఉందని వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ పని తీరును ప్రజలు గమనించాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement