Wednesday, April 24, 2024

Huzurabad By Eelection: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైన‌ర్స్ వీరే..

హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరి ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలో దిగింది. ఉపఎన్నికు సంబంధించి నామినేష‌న్ల ప‌ర్వం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేసేందుకు స‌ర్వం సిద్ధం చేసుకుంటోంది. 20 మందితో కూడిన క్యాంపెన‌ర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి, ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, దామోద‌ర రాజ‌న‌ర్సింహా, మ‌ధుయాష్కీ త‌దిత‌రులు ఈ క్యాంపైన‌ర్ల జాబితాలో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 వేల ఓట్ల సాధించి.. రెండో స్థానంలో నిలిచింది. అయితే, మారిన రాజకీయ పరిణామల నేపథ్యలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ కు పోటీ ఏర్పడింది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే.. మెరుగైన ఓట్లు సాధించాలని పట్టుదలతో ఉంది.

ఇది కూడా చదవండి: వెదర్ అలర్ట్: మరో మూడు రోజులు భారీ వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement