Monday, October 7, 2024

Talent | సిద్దిపేట ముద్దుబిడ్డ‌కు అభినంద‌న‌లు.. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ ర‌న్న‌ర‌ప్‌గా లాస్య‌ప్రియ‌

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా కొన్ని ప్రోగ్రామ్స్‌తో మంచి పేరు తెచ్చుకుంటోంది. అందులో ఈ మ‌ధ్య నిర్వ‌హించిన తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సెకండ్ సీజ‌న్ కు జ‌నాల నుంచి పిచ్చ పిచ్చ‌గా రెస్పాన్స్ వ‌చ్చింది. చాలా రోజులుగా వ‌స్తున్న ఈ ప్రోగ్రామ్ ఈ వారం ఫైన‌ల్‌కు చేరుకుని విజేత‌ను కూడా ప్ర‌క‌టించింది. అయితే.. ఇందులో తెలంగాణ‌లోని సిద్దిపేట‌కు చెందిన ఓ అమ్మాయి త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. అంతేకాకుండా మంత్రి హ‌రీశ్‌రావు అభిమానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. ఫైన‌ల్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పాట‌లు పాడి ఆయ‌న అంత‌రంగాన్ని గెలుచుకుంది. దీంతో అల్లు అర్జున్ ఏకంగా లాస్య ప్రియ‌కు పాప్ స్టార్ అనే బిరుదుతో ఓ లాకెన్‌ని అందించారు.

ఇక‌.. ఆహా ఓటీటీలో నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్-2023 కార్యక్రమం ముగిసింది. ఈ సీజన్-2 పోటీల్లో ఆంధ్ర‌ప్రదేశ్‌లోని విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన భాగ‌వ‌తుల సౌజన్య విజేత కాగా, తెలంగాణ‌లోని సిద్దిపేట‌కు చెందిన లాస్యప్రియ రన్నరప్ గా నిలిచింది. ఈ క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు లాస్య‌ప్రియ‌ను అభినందించారు.

కాగా, సిద్ధిపేట ముద్దుబిడ్డ అంటూ లాస్యప్రియపై హ‌రీశ్‌రావు ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో రన్నరప్‌గా నిలిచిన లాస్యప్రియకు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. మున్ముందు లాస్యప్రియ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికీ గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు మంత్రి హ‌రీశ్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement