Saturday, April 20, 2024

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ : పవన్ కీలక ప్రకటన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని ఆయ‌న స్పష్టం చేశారు. తెలంగాణలోని మూడో వంతు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. న‌ల్గొండ జిల్లాలో పవన్‌కు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. అతడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement