Thursday, April 25, 2024

రాజకీయాల్లోకి వస్తా … నటుడు విశాల్

 తిరుపతి (రాయలసీమ ప్రభవెబ్ ప్రతినిధి) : ప్రముఖ సినీ నటుడు విశాల్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని.. అయితే, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడుపై పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలు మాత్రం వదంతులేనని ప్రముఖ సినీ నటుడు విశాల్ రెడ్డి తేల్చి చెప్పాడు. విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నాడని, కుప్పం నుంచి పోటీ చేయబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న విశాల్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లాఠీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్‌కు సంబంధించి చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాల్ మాట్లాడుతూ.. రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చాడు. అయితే, కుప్పం ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ఉన్న మాట వాస్తవమేనన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement