Wednesday, April 17, 2024

ప‌ల్నాటి పౌరుషానికి ప్ర‌తీక‌….

కోడి పందాలకు కుక్కుట శాస్త్రం
పందెంకోడి జన్మనక్షత్రంతో జాతకబలం
పాశ్చాత్య దేశాల్లో కోడిపందాల క్లబ్‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:పల్నాటి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన కోడిపందాలు క్రమేణ తెలుగు రాష్ట్రాల్లో విస ్తరించాయి. సరిహద్దు రాష్ట్రాల్లో పందెంకోళ్ల అమ్మకాలు, ఫౌం హౌజుల్లో కోళ్ల పందాలు కొనసాగుతున్నాయి. హైదరా బాద్‌ శివార్లతో అనేక ఫౌంహౌజ్‌ ల్లో రహస్యం గా కోళ్ల పం దాలు నిర్వహిస్తున్నట్లు నిఘావర్గాల సమాచారం. కృష్ణ, గుం టూరు, ఉభయగోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాల్లో శతాబ్దాల నుంచి సంక్రాంతి పండుగకు మూడు రోజుల ముందునుంచి కోళ్ల పందాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
పల్నాటి వీరగాధలను కాకతీయుల కాలంలో కళా రూపాలుగా ప్రదర్శించారు. పల్నాటి పౌరుషానికి నిద ర్శంనంగా కోడిపందాలను నిర్వహించారు. అయితే ఆంధ్రకే పరిమితమైన ఈ కోళ్ల పందాలతో హింస చెలరేగుతుందనీ, కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి హింసిస్తున్నారని క్రీ.శ. 1849 లో బ్రిటీష్‌ గవర్నమెంట్‌ ఇండియాతో పాటుగా కెనడా తదితర దేశాల్లో కోడి పందాలను నిషేధించింది. జంతువులపైక్రూరత్వ నిషేధచట్టం 1960 మేరకు 2015లోభారతప్రభుత్వం, 2016 లో తెలంగాణ ఉన్నత న్యాయ స్థానం, 2018లో సుప్రీం కోర్టు కోడిపందాలతో పాటుగా జంతువులపై హింసను నిషేధిం చా యి. అయితే నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ సంక్రాంతి సంద ర్భంగా కోడి పందాలు నిర్వహించడం ఆనవాయితీ అయింది.

పెందెం కోళ్లకు శాస్త్రం సంబంధమైన అంశాలు కూడా ఉన్నాయి. కుక్కటశాస్త్రం మేరకు కోడి పుంజుల వర్గీకరణ చేస్తారు. కోడిపుంజు జన్మనక్షత్రం, కోడిపుంజు జాతకం మేరకు వర్గీకరించి పందెంలో దించుతారు డేగా, నెమలికాకి, అబ్రసేతు, పర్ల పసల, కొక్కిరాయి, రసంగి, ఎరుపురంగు నెమలిజాతి, ఎర్రమైల, ఎర్రకోడి పచ్చ కాకకి పంజులు ఎక్కువగా పందెంలో నిలుపుతారు. ఈ కోళ్లకు ప్రత్యేక శిక్షణతో పాటుగా సిక్స్‌ ఫ్యాక్‌ కోసం ఆహారాలు, వ్యాయామాలు చేపిస్తారు. అనంతరం కాళ్లకు కోడికత్తులుకడతారు. ప్రస్తుతం ఆపరేషన్‌ థియోటర్లలో వినియోగించే చిన్న బ్లేడ్స్‌ కడుతున్నట్లు తెలిసింది. ఈ కోళ్ల కు రూ. 30వేల నుంచి రూ. 5లక్షల వరకు పలుకుతాయి.
క్రీ.శ. 1181 – 1182 వరకు జరిగిన పల్నాటి యుద్ధం తో కోడిపందాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచడంతో పాటుగా ఆనాటి దేశంలోని వివిధ రాచరిక పాలనలోని రాజ్యాల్లో విస్తరించింది. అయితే కాలక్రమేణ ఈ కోడిపందాలు కోస్తాఆంధ్రకు పరిమితమై సంక్రాంత్రి సంబరాల్లో సందడి చేస్తున్నాయి. 6000ల సంవత్సరాల క్రితం పర్షియాలో కోడిపందాలు ఉన్నట్లుఇటీవల పురావస్తు తవ్వకాల్లో వెల్లడిఅయింది.
కోడిపందాలతో గ్రీకులో క్రీ.పూ. 524 – 460 వరకు హింసచెలరేగి ఆనేకరాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల్లో అనేక రాజ్యాలు అంతరించాయి. రోములో కోడిపందాలు నిర్వహించినట్లు చరిత్ర ఆధారాలున్నాయి. క్రీ.శ.ప్రారంభంలో అనేకదేశాలు కోడిపంజాలు నిషేధించినట్లు చరిత్ర చెపుతుంది. ప్రాచీన సమాజంలో కోడిపందాలకోసం ప్రత్యేక మైనమౖైెదానాలుండేవి. రాజ్యాలను పణంగా పెట్టిపందాలను నిర్వించేవారు. గెలిచిన, ఓడిన రాజ్యాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. 16వశతాబ్దంలో ఇగ్లాండులో కోడిపందాల నిర్వహణ రాజఠీవిగా భావించి ప్రత్యేక మైదానాలు ఏర్పాటు చేశారు.ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌, వియత్నాం, ఈక్విడార్‌ లో కోడిపందాలు కోనసాగుతున్నాయి.
నిరంతరం ఈ పందాలను నిర్వహించడంకోసం ఇక్కడ ప్రత్యేక క్లబ్‌ లు ఉన్నాయి. మెక్సికోలో క్రీ.శ. 1784- 1786 వరకు నిర్వహించిన కోడిపందాలు హింసను ప్రేరేపించడంతో అనంతరం అక్కడ నిషేధించారు. కోడిపందాలపై 1648లో జార్జి విల్సన్‌ రాసిన కాక్‌ ఆఫ్‌ దిగేమ్‌ పుస్తకంలో కోడిపందాల చరిత్రపై చేసిన పరిశోధనను పురావస్తు శాఖ ఆమెదిత గ్రంధంగా గుర్తించింది. ఇప్పటికి ఇరాన్‌, ఇండోనేషియా,బ్రెజిల్‌,పెరు,ఫిలిపైన్స్‌ , మెక్సికో, ప్రాన్స్‌, క్యూబా, పాకిస్తాన్‌, అమెరికా, జపాన్‌ దేశాల్లో గ్రామీణ క్రీడగా కోడిపందాలను నిర్వహిస్తున్నారు. అయితెె వ్యవసాయ ప్రాధాన్యతగల ఆంధ్రప్రదేశ్‌ లో సంక్రాంత్రి సందర్భంగా నిర్వహించే కోడిపందాల ప్రాముఖ్యత మాత్రం దినదినాభివృద్ధి చెందుతూ సరిహద్దురాష్ట్రాలకు విస్తరించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement