Friday, April 19, 2024

రెండు దేశాల్లో కోకా కోలా బ్యాన్ .. ఎందుకో తెలుసా ..

బిర్యియాని తిన్నా లేదా ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్న త‌ర్వాత ఓ డ్రింక్ తాగితే ఆ కిక్కే వేర‌ప్ప‌.. ఎక్కువ‌గా థ‌మ్స్ అప్ , కోకా కోలా లాంటి హ‌ర్డ్ డ్రింక్స్ ని జ‌నం ఇష్ట‌ప‌డుతుంటారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డ్రింక్స్ కి మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే రెండు దేశాల్లో మాత్రం కోకా కోలా బ్యాన్ అని మీకు తెలుసా… మ‌రి ఆ వివ‌రాలు చూద్దాం .. .దక్షిణ అమెరికాలోని క్యూబా, ఉత్తరకొరియా. ఈ రెండుదేశాల్లో రకరకాల కూల్ డ్రింక్స్ లభిస్తాయి గానీ కోకాకోలా మాత్రం ఉండదు. క్యూబాలో అంతగా రాజకీయ స్వేచ్ఛ ఉండదు.

ఇక ఉత్తరకొరియా ఆల్రెడీ నియంత కిమ్ జోంగ్ ఉన్ అధీనంలో ఉంది. కిమ్‌కి ఏదైనా డీల్ నచ్చకపోతే ఆ ఉత్పత్తిని తన దేశంలోకి రానివ్వడు. అటు క్యూబా, ఇటు ఉత్తర కొరియాలో వ్యాపార ఒప్పందాలు అంత త్వరగా కుదరవు. ఆ రెండు దేశాలూ రకరకాల కొర్రీలు పెడతాయి. ఎన్నో ఆంక్షలు విధిస్తాయి… అవన్నీ భరిస్తూ… వ్యాపారం చెయ్యడం తమ వల్ల కాదంటోంది కోకా-కోలా సంస్థ‌. ఈ రెండు దేశాల్లో విదేశాల నుంచి రహస్యంగా తెచ్చుకొని కూడా కోక్ తాగకూడదు. అలా తాగితే… కఠిన శిక్షలు ఉంటాయట.

Advertisement

తాజా వార్తలు

Advertisement