Friday, March 29, 2024

రాష్ట్రాలకు ‘కరెంట్‌’ సాయం.. కేంద్రం కీలక సూచనలు

దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. మిగులు విద్యుత్​ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని తెలిపింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్​ను ప్రజల అవసరాల కోసం రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది. విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరెంట్‌ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద్యుత్‌ కోతలుఅమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్‌’నువాడుకోవాలని తెలిపింది.

ఇది కూడా చదవండి: పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం రేట్లు ఇవే..

Advertisement

తాజా వార్తలు

Advertisement