Thursday, April 25, 2024

చిరుత‌పులి పిల్ల‌కి పాలు ప‌ట్టించిన – సీఎం యోగి ఆదిత్య‌నాథ్

చిరుత‌పులి పిల్ల‌కి పాలు ప‌ట్టించారు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్. వెటర్నరీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న చిరుత పిల్లను ఒడిలోకి తీసుకొని.. డబ్బాతో పాలు తాగించారు. ఆ చిన్నారి చిరుతకు చండీ అని పేరు పెట్టారు. అనంతరం..అక్క‌డి వైద్య ఆరోగ్య‌ అధికారులతో మాట్లాడారు..కాగా వన్య‌ప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా గోరఖ్​పుర్​లోని అష్ఫక్ ఉల్లాఖాన్ జువలాజికల్ పార్క్​ను యోగి సందర్శించారు. ఈ సందర్భంగా తెల్ల పులి గీతను జంతు ప్రదర్శన శాలలో విడిచిపెట్టారు. రెండున్నర నెలల క్రితం ఈ పులిని ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే.. రెండు చిరుత‌ పిల్లలకు నామకరణం చేశాడు. ఒక పిల్ల‌కు చంఢీ, మ‌రో దానికి భ‌వాని అని పేర్లు పెట్టారు. అనంత‌రం ఆ పిల్ల‌ల‌ను గోరఖ్‌పూర్ జూలాజికల్ పార్కుకు తరలించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం కిథోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్‌పూర్ బంగర్ గ్రామంలో చిరుత పులి పిల్ల కనిపించింది. గ్రామస్తులు ఆ పిల్లను ఎత్తుకుని గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం రేంజర్ జగన్నాథ్ కశ్యప్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పిల్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఆ పిల్ల వయస్సు రెండు-మూడు వారాలే. దానికి ‘సింబి’ అనే పేరు పెట్టారు. అనంత‌రం.. ఏప్రిల్ 8న గోరఖ్‌పూర్‌లోని జూలాజికల్ పార్కుకు పిల్లను పంపించారు. గోరఖ్‌పూర్‌లోనే దీనికి ఇప్పుడు ‘చండీ’ అనే కొత్త పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పిల్ల వయసు ఆరు నెలల 18 రోజులు. దాని బరువు 11.65 కిలోలు. దానికి ఆహారంగా.. ఉడికించిన, పచ్చి మాంసం, చికెన్ సూప్ మొదలైన వాటిని అందిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement